మహిళల స్వయం ఉపాధికి కృషి | - | Sakshi
Sakshi News home page

మహిళల స్వయం ఉపాధికి కృషి

Nov 3 2026 8:13 AM | Updated on Nov 3 2026 8:13 AM

మెదక్‌ కలెక్టరేట్‌: నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పించేందుకు మెదక్‌ మిల్లీ అసోసియేషన్‌ నిరంతరం కృషి చేస్తుందని బాధ్యులు తెలిపారు. మెదక్‌ మిల్లీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పట్టణంలో సోమవారం ఉచిత మెహందీ డిజైనింగ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మెదక్‌ మిల్లీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గతంలో ఉచిత టైలరింగ్‌ ట్రైనింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. అదే సేవలను కొనసాగిస్తూ ఉచిత మెహందీ డిజైనింగ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. మహిళలకు నైపుణ్య శిక్షణ అందించి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే అసోసియేషన్‌ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ బాధ్యులు డాక్టర్‌ ఒమర్‌ ఖాన్‌, ముఫ్తీ మహమ్మద్‌ సాబిర్‌ అలీ, సయ్యద్‌ సాదత్‌ అలీ జకీ, సయ్యద్‌ గఫార్‌ అహ్మద్‌ నియాజీ, మహమ్మద్‌ రియాజుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement