వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ | - | Sakshi
Sakshi News home page

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ

Nov 3 2026 8:13 AM | Updated on Nov 3 2026 8:13 AM

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): తరగతి గదిలో వెనుకబడిప విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, వారికి అర్థమయ్యే పద్ధతిలో బోధన చేపట్టాలని ఎంఈఓ విఠల్‌ అన్నారు. సోమవారం ఆయన చిలప్‌చెడ్‌లో ప్రాథమిక పాఠశాలల విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెరుగుదలపై ఉపాధ్యాయులతో కాంప్లెక్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో భాష, గణిత సామర్థ్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు, పరీక్షల ఫలితాల ఆధారంగా, విద్యార్థులకు ప్రత్యేక బోధన చేపట్టాలన్నారు. కార్యక్రమంలో చిలప్‌చెడ్‌, చండూర్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు ధనమూర్తి, రమేశ్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఎంఈఓ విఠల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement