వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి | - | Sakshi
Sakshi News home page

వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

Nov 3 2026 8:13 AM | Updated on Nov 3 2026 8:13 AM

నిజాంపేట (మెదక్‌): మండలంలో వరి కోతలు పూర్తికావడంతో రైతులు తమ ధాన్యాన్ని స్థానిక సబ్‌ మార్కెట్‌ యార్డుకు తరలించి ఆరబెడుతున్నారు. అయితే, ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు కురిసే సూచనలు ఉండటంతో ఆరబెట్టిన ధాన్యం నీటిపాలై నష్టపోవాల్సి వస్తుందని రైతన్నలు వాపోతున్నారు. రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో యార్డులోనే కాపలా కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, ధాన్యాన్ని మద్దతు ధరకు సేకరించి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement