నిజాంపేట (మెదక్): నిజాంపేట మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో రూ. 7.50 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ చలమేటి నరేందర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ ఎంపీ రఘునందన్ రావు సహకారంతో కాలనీలో అంతర్గత రహదారి నిర్మాణ పనులను చేపట్టినట్లు తెలిపారు. సరైన రహదారి లేక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గ్రామాభివృద్ధిలో భాగంగా రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న అభిరాం
రామాయంపేట (మెదక్): స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేటలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ రన్నింగ్ పోటీల్లో మంజీరా విద్యాలయానికి చెందిన విద్యార్థి అభిరాం ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ మేరకు పాఠశాల కరస్పాండెంట్ జితేందర్‌రెడ్డి వివరాలను వెల్లడించారు. రాష్ట్ర స్థాయికి ఎంపికై న అభిరాంను పాఠశాల యాజమాన్యం శాలువాతో సన్మానించిందిజ
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు అందించాలి
చిన్నశంకరంపేట (మెదక్): ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన పేదలకు న్యాయం చేయాలని కోరుతూ మల్లుపల్లి గ్రామస్తులు సోమవారం ప్రజావాణిలో ఎంపీడీఓ దామోదర్‌కు వినతిపత్రం అందజేశారు. మొదటి, రెండవ విడతల్లో ఇళ్లు మంజూరు కాని 20 మంది అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. అలాగే చందంపేట గ్రామ శివారులోని సర్వే నంబర్ 472లో ఉన్న తమ భూ సమస్యను పరిష్కరించాలని పలువురు రైతులు వినతిపత్రం ఇచ్చారు. ప్రజావాణిలో మరో నాలుగు దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీఓ తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి పాల్గొన్నారు. కాగా, నార్సింగి మండల కేంద్రంలో ఎంపీడీఓ తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణికి ఒక్క దరఖాస్తు కూడా రాలేదు.
కొనుగోలు కేంద్రం ప్రారంభం
చేగుంట(తూప్రాన్): మండలంలోని వడియారం, ఉల్లితిమ్మాయిపల్లి గ్రామాల్లో సోమవారం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సహకార సంఘం చైర్మన్ బాగులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం విక్రయించాలని తెలిపారు. కార్యక్రమాల్లో సర్పంచ్ సత్యనారాయణ సిబ్బంది పాల్గొన్నారు.
కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి
నారాయణఖేడ్: విద్యార్థులు కష్టపడి చదివి పదో తరగతి వార్షిక పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని హైదరాబాద్ కార్వాన్ ఎమ్మెల్యే, ఎంఐఎం పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి కౌసర్ మొహియుద్దీన్ సూచించారు. ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో శ్రీసాలారే మిల్లత్ ఎడ్యుకేషన్ ట్రస్టుశ్రీ సౌజన్యంతో సోమవారం ఖేడ్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉర్దూ మీడియంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు ఎంఐఎం ఖేడ్ అధ్యక్షుడు మొహిద్ పటేల్‌తో కలిసి ఆల్‌ఇన్‌వన్ ఎస్సెస్సీ మోడల్ టెస్ట్ పేపర్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం యాదవరెడ్డి, నాయకులు మన్నన్, మహ్మద్ పాషామియా, షేక్ అమ్జద్, ముజీబ్ ఖాన్, హబీబ్, అబ్దుల్లా, షేక్ ఫయాజ్, అసద్ పటేల్ పాల్గొన్నారు.


