శీతాకాల ప్రవేశంతో జిల్లా వ్యాప్తంగా పొగమంచు ఎక్కువగా కురుస్తోంది. జిల్లాలోని పలు మండలాలైన చిలప్‌చెడ్, శివ్వంపేట, కౌడిపల్లి వంటి ప్రాంతాల్లో సోమవారం ఉదయంపూట పొగమంచు విపరీతంగా కురిసింది. దీంతో రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకు వారికి, ఎదురుగా వచ్చే వారు సరిగ్గా కనబడక ఇబ్బందులకు గురవుతున్నారు. చల్లగా ఉండటంతో ప్రజలు, విద్యార్థులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా కొన్ని చోట్ల కాగా పంటపొలాల్లో పొగమంచుతో ప్రకృతి కనువిందు చేసింది. – చిలప్‌చెడ్(నర్సాపూర్)/శివ్వంపేట(నర్సాపూర్)/కౌడిపల్లి(నర్సాపూర్)


