పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వరా? | - | Sakshi
Sakshi News home page

పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వరా?

Nov 3 2026 8:13 AM | Updated on Nov 3 2026 8:13 AM

హౌసింగ్‌ ఏఈని నిలదీసిన అధికార పార్టీ సర్పంచ్‌

రేగోడ్‌(మెదక్‌): పేదలు రేకుల షెడ్లలో దుర్భర జీవితం గడుపుతున్నా ఇందిరమ్మ ఇళ్లు ఎందుకు మంజూరు చేయడం లేదని అధికార పార్టీ సర్పంచ్‌ సంగ్యానాయక్‌ హౌసింగ్‌ ఏఈ ప్రియను నిలదీశారు. గత సమావేశంలో సమస్యను ప్రస్తావించినా ఇప్పటివరకు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సోమవారం మండల పరిషత్‌ కార్యాలయంలో మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద తండా సర్పంచ్‌ సంగ్యానాయక్‌ మాట్లాడుతూ.. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తేనే అధికారులు ఇళ్లు మంజూరు చేస్తారా? మీరు రెగ్యులర్‌గా పనిచేస్తున్నారా? లేదా అంటూ హౌసింగ్‌ ఏఈని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని దోసపల్లి సర్పంచ్‌ అమర్‌ సింహారెడ్డి ఆరోపించారు. రేగోడ్‌ మండలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా.. కరువు మండలాల జాబితాలో చేర్చకపోవడంపై సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వల ప్రకారం డిసెంబర్‌ చివరి వరకు మాత్రమే తాగునీరు సరఫరా చేసే పరిస్థితి ఉందని, నీటిని ప్రజలు పొదుపుగా వాడుకోవాలని మిషన్‌ భగీరథ డీఈ బాలకృష్ణ సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ దత్తారెడ్డి, ఏఓ శ్రీదేవి, డాక్టర్‌ శ్వేత, ఎంపీఓ గంగాధర్‌, ఏపీఓ జగన్మోహన్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

వాడీవేడిగా మండల స్థాయి సమీక్ష సమావేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement