గత ప్రభుత్వ హయాంలోనే రోడ్లకు మోక్షం | - | Sakshi
Sakshi News home page

గత ప్రభుత్వ హయాంలోనే రోడ్లకు మోక్షం

Nov 3 2026 8:13 AM | Updated on Nov 3 2026 8:13 AM

శివ్వంపేట(నర్సాపూర్‌): గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే గ్రామీణ బీటీ రోడ్లకు మోక్షం లభించిందని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. సోమవారం చిన్న గొట్టిముక్కల నుంచి చెన్నాపూర్‌, శివ్వంపేట గ్రామాలను కలుపుతూ వ్యవసాయ పొలాల గుండా వేసిన బీటీ రోడ్డును ఆమె ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వంలో మంజూరు చేసిన రోడ్డు పనులు చేపడుతున్నామని, కొత్తగా రోడ్లకు కాంగ్రెస్‌ ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదని ఆరోపించారు. చేసిన పనులకు బిల్లుల రాక కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రాని పరిస్థితి నెలకొందన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రమణగౌడ్‌, నాయకులు హరికష్ణ, మన్సూర్‌, చంద్రగౌడ్‌, నర్సింగరావు, మహేందర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, నరేందర్‌, రాజేందర్‌, యాదిరెడ్డి, తదితరులు ఉన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం..

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రాకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం చెన్నాపూర్‌, చిన్న గొట్టిముక్కుల, తిమ్మాపూర్‌, పిల్లుట్ల, ఎదుల్లాపూర్‌, గుండ్లపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సర్పంచులు హన్మంత్‌రావు, కొమురయ్య, నారాయణరావు, రాజు ఉన్నారు.

ఎమ్మెల్యే సునీతారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement