అల్లాదుర్గంను కరువు మండలంగా ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

అల్లాదుర్గంను కరువు మండలంగా ప్రకటించాలి

Nov 3 2026 8:13 AM | Updated on Nov 3 2026 8:13 AM

అల్లాదుర్గం(మెదక్‌): కరువు మండలాల ప్రకటనలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, తప్పుడు సర్వేతో కరువు మండలాల ప్రకటన చేసిందని పీఎసీఎస్‌ చైర్మన్‌ దుర్గారెడ్డి, మండల బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు పల్లేగడ్డ నర్సింలు ఆరోపించారు. సోమవారం అల్లాదుర్గం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. అనంతరం స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పంటలు పండక, దిగుబడి రాక రైతులు నష్టపోయినట్లు తెలిపారు. మంత్రి దామోదర నియోజకవర్గంలోనే కరువు మండలాల ప్రకటనలో అధికారులు సరైన సర్వే చేయలేదన్నారు. ఇప్పటికై నా కలెక్టర్‌ పూర్తి స్థాయిలో విచారణ జరిపి అల్లాదుర్గంను కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు కృష్ణగౌడ్‌, దశరత్‌, రవి, బేతయ్య, సాయికుమార్‌, పవన్‌, సూర్యకుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement