పెద్దశంకరంపేట (మెదక్): వానాకాలం సీజన్‌లో మండలంలో 11,700 ఎకరాల్లో వరి సాగు చేసినట్లు మండల వ్యవసాయ అధికారి నాగం కృష్ణ తెలిపారు. వరి కోతల సమయంలో రైతులు, హార్వెస్టర్ నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. హార్వెస్టర్‌తో కోత కోసేటప్పుడు డ్రమ్ స్పీడ్, బ్లోవర్ వేగాన్ని పంటకు అనుగుణంగా సక్రమంగా సర్దుబాటు చేసుకోవాలన్నారు. కోత అనంతరం ధాన్యాన్ని బాగా ఆరబెట్టి, దుమ్ము, ధూళి లేకుండా శుభ్రం చేసి తేమ శాతం 17 శాతానికి మించకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తిరస్కరణ, తరుగుల సమస్యలు ఉండవన్నారు. ప్రభుత్వం సాధారణ రకం ధాన్యానికి క్వింటాకు రూ.2,441, గ్రేడ్–ఏ రకానికి రూ.2,461 మద్దతు ధర నిర్ణయించిందని, దీనికితోడు అర్హత కలిగిన సన్న రకాల ధాన్యానికి రూ.500 బోనస్‌తో కలిపి మొత్తం రూ.2,961 వరకు రైతులకు అందుతుందని ఆయన వివరించారు.
వ్యవసాయ అధికారి నాగం కృష్ణ


