నర్సాపూర్: ఇంజనీరీంగ్ విద్యార్థులు ప్రయోగశాలను సద్వినియోగం చేసుకుని నైపుణ్యాలను పెంచుకోవాలని ఆటోమోటివ్ టెస్ట్ సిస్టమ్స్ సంస్థ(ఏటీఎస్) మేనేజింగ్ డైరెక్టర్ రామనాథన్ శ్రీనివాసన్ చెప్పారు. స్థానిక బీవీ రాజు ఇంజనీరింగ్ కాలేజీకి ఏటీఎస్ సంస్థకు మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..తమ సంస్థ ఆటోమొబైల్ రంగంలో అత్యాధునిక పరీక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తుందన్నారు. ఆటోమోటివ్ టెస్టింగ్, ఆటోమేషన్, సాఫ్ట్వేర్ అభివృద్ధి, డేటా విశ్లేషణ, ఇంజనీర్లకు శిక్షణ తదితర సేవలకు అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు ప్రయోగశాల సదుపాయాలను సద్వినియోగం చేసుకుని, సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ సంజయ్‌దూబె, డైరెక్టర్ లక్ష్మిప్రసాద్, హెచ్ఓడీలు వరుణ్, సుబ్బిరామారెడ్డి, సంజీవ్‌రెడ్డి, విష్ణు మోటార్ స్పోర్ట్స్ ప్రాజెక్టు మేనేజర్ మనోనీత్ సింగ్, మేనేజర్ బాపిరాజు, ఏఓ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.


