ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Nov 1 2026 8:13 AM | Updated on Nov 1 2026 8:13 AM

రామాయంపేట (మెదక్‌): మండలంలోని తొనిగండ్ల గ్రామంలో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్‌ దుర్గయ్య, మాజీ ఎంపీటీసీ నాగులు మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మౌనిక, మాజీ సర్పంచులు సిద్ధరాంలు, శ్యామయ్య, వార్డు సభ్యులు బాలకృష్ణ, సుజాత, భాను, రమేశ్‌, రైతులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాల్లో దళితులకు ప్రాధాన్యం

నర్సాపూర్‌: దళితులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని ఎమ్మార్పీఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కుమార్‌ డిమాండ్‌ చేశారు. శనివారం పలువురు నాయకులతో కలిసి మండల పరిషత్‌ కార్యాలయ సూపరింటెండెంట్‌ కృష్ణమూర్తికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కుమార్‌ మాట్లాడుతూ.. చేవెళ్ల డిక్లరేషన్‌ హామీ మేరకు అంబేడ్కర్‌ అభయహస్తం పథకం కింద ప్రతి దళిత కుటుంబానికి రూ.12 లక్షలు అందించాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌కు నిధులు విడుదల చేసి అర్హులకు సంక్షేమ పథకాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇతర ప్రభుత్వ పథకాల్లోనూ దళితులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్‌ నాయకులు వినోద్‌కుమార్‌, విద్యాసాగర్‌, నరేశ్‌, అనిల్‌, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

నిజాంపేట (మెదక్‌): నిజాంపేటలో శనివారం ముస్లిం మైనార్టీ సభ్యుల ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మహమ్మద్‌ అజ్గర్‌, కోశాధికారిగా మహమ్మద్‌ బాబు మియా, కార్యదర్శిగా మహమ్మద్‌ జాఫర్‌, ఉపాధ్యక్షుడిగా అబ్దుల్‌ పాషాను ఎంపిక చేశారు. సలహాదారులుగా మహమ్మద్‌ నాయబ్‌, గౌస్‌ పాషా, సర్దార్‌లను నియమించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు అజ్గర్‌ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మహమ్మద్‌ ఇబ్రహీం, రఫీ, ఖాసీం, మీర్జా, ఫాజిల్‌, అజీజ్‌ మియా, బాబు, రఫీల్‌ తదితరులు పాల్గొన్నారు.

పౌరహక్కులపై

అవగాహన అవసరం

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): పౌరహక్కులపై అవగాహన కలిగి ఉండటం ద్వారా ప్రజా సమ స్యలను పరిష్కరించుకోవచ్చని అధికారులు అన్నారు. శనివారం మండల పరిధిలోని బండపోతుగల్‌ గ్రామంలో పౌరహక్కుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామస్తులతో మాట్లాడి పౌరసరఫరాలు, రేషన్‌ సరుకులు, పింఛన్ల పంపిణీకి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో హెడ్‌ కానిస్టేబుల్‌ ఇలియాస్‌రెడ్డి, ఆర్‌ఐ శ్రీహరి, పంచాయతీ కార్యదర్శి సంజీవ్‌, నాయకుడు ప్రవీణ్‌రెడ్డి,పాల్గొన్నారు.

గ్రామాల్లో కుల వివక్షకు తావులేదు

చిన్నశంకరంపేట(మెదక్‌): భారత రాజ్యాంగం అందరికి సమానహక్కులు కల్పించిందని గ్రామాల్లో ఎలాంటి కుల వివక్షకు తావులేదని చిన్నశంకరంపేట తహసీల్దార్‌ మాలతి అన్నా రు. శనివారం చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి లో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. తహసీల్దార్‌ మాట్లాడుతూ.. గ్రా మంలో ఎలాంటి కుల వివక్ష ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సునీత, ఉపసర్పంచ్‌ రాజు, కర్రె యాదగిరి, సంజీవులు, సంగని యాదగిరి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement