మున్సిపల్‌ సమావేశం బాయ్‌కాట్‌ | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ సమావేశం బాయ్‌కాట్‌

Nov 1 2026 8:13 AM | Updated on Nov 1 2026 8:13 AM

కోరం లేక వాయిదా

నర్సాపూర్‌: నర్సాపూర్‌ మున్సిపాలిటీలో సర్వసభ్య సమావేశాల బహిష్కరణ పరంపర కొనసాగుతోంది. శనివారం నిర్వహించాల్సిన మున్సిపల్‌ సమావేశాన్ని బీజేపీ, బీఆర్‌ఎస్‌కు చెందిన తొమ్మిది మంది కౌన్సిలర్లు బహిష్కరించారు. దీంతో సరిపడా కోరం లేక సమావేశం వాయిదా వేస్తున్నట్లు కమిషనర్‌ సాయికుమార్‌ ప్రకటించారు.

రెండోసారి సమావేశం బహిష్కరణ

మున్సిపల్‌ పాలకవర్గం ఫిబ్రవరి 16న ప్రమాణ స్వీకారం చేసి తొలి సమావేశం నిర్వహించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు తొమ్మిది సమావేశాలు ఏర్పాటు చేయగా, రెండుసార్లు మెజారిటీ కౌన్సిలర్లు బహిష్కరించడం గమనార్హం. గత మే 25న తొలిసారిగా వైస్‌ చైర్మన్‌ బుచ్చెష్‌యాదవ్‌తో పాటు బీజేపీ, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు. మున్సిపల్‌ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులపై తమకు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అప్పట్లో వారు ఆరోపించారు.

అభివృద్ధి పనులపై అసంతృప్తి

శనివారం జరిగిన సమావేశానికి చైర్‌పర్సన్‌ లక్ష్మి తో పాటు కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు హాజరయ్యారు. మరో ఇద్దరు వ్యక్తిగత కారణా లతో గైర్హాజరయ్యారు. బీజేపీకి చెందిన నలుగురు, బీఆర్‌ఎస్‌కు చెందిన ఐదుగురు కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించా రు. ఈ సందర్భంగా వైస్‌ చైర్మన్‌ బుచ్చెష్‌యాదవ్‌ మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ప్రజలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదని, కౌన్సిలర్లకు పనులకు సంబంధించిన సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. కౌన్సిల్‌ నిర్ణయాలకు అనుగుణంగా పనులు చేపట్టకపోవడంతో నిరసనగా సమావేశాన్ని బహిష్కరించినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు సైతం ఇదే కారణంతో సమావేశానికి దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

సమావేశానికి అవసరమైన తొమ్మిది మంది కౌన్సిలర్లు హాజరుకావాల్సి ఉండగా, చైర్‌పర్సన్‌తో పాటు మరో ముగ్గురు మాత్రమే వచ్చారని కమిషనర్‌ సాయికుమార్‌ తెలిపారు. సరిపడా కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేసినట్లు వెల్లడించారు.

సమావేశాన్ని బహిష్కరించిన బీజేపీ, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు

కోరంలేక0 వాయిదా వేసిన కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement