రైతులకు శాశ్వత పరిష్కారం
రేగోడ్ (మెదక్): భూముల రీసర్వేతో రైతుల పొలం హద్దులు, గట్ల పంచాయతీలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆర్డీఓ రమాదేవి అన్నారు. మండలంలోని బురాన్‌వాడి తండాలో శనివారం భూముల రీసర్వేపై గ్రామసభను సర్పంచ్ సక్కుబాయి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూముల రీసర్వేకు వచ్చే సర్వేయర్లకు రైతులు పూర్తి సహకారం అందించాన్నారు. వారం రోజుల్లో రీసర్వే ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు మున్నూరు కిషన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్.దిగంబర్ రావు, తహసీల్దార్ దత్తారెడ్డి, మాజీ ఎంపీటీసీ నరేందర్, మాజీ కోఆప్షన్ సభ్యుడు చోటు మియా, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు పీర్యా నాయక్ పాల్గొన్నారు.
మెదక్ ఆర్డీఓ రమాదేవి


