ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి

Nov 1 2026 8:13 AM | Updated on Nov 1 2026 8:13 AM

వెల్దుర్తి(తూప్రాన్‌): ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి డీఈఓ రాజు అన్నారు. శనివారం మండలంలోని కుకునూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీతారాం పదవీ విరమణ మహోత్సవం పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి డీఈఓ రాజు, పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు హాజరై సీతారాం దంపతులను ఘనంగా సన్మానించారు. అనంతరం డీఈఓ రాజు మాట్లాడుతూ.. మెదక్‌, కుకునూరు గ్రామాల్లో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ భవనాల నిర్మాణానికి రూ.10 కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభమవుతా యని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున విద్యార్థులకు నీటి సంరక్షణపై ఉపాధ్యాయులు అవగాహన కల్పి ంచాలన్నారు. అలాగే, విద్యార్థులు తమ తల్లిదండ్రులకు కూడా నీటి పొదుపు ఆవశ్యకతను వివరించాలని సూచించారు. మృదుస్వభావి అయిన సీతా రాం పాఠశాల అభివృద్ధికి, నిర్వహణకు బాధ్యతాయుతంగా సేవలందించారని పలువురు కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బందితో పాటు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

డీఈఓ రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement