మెదక్ జోన్: కేసుల పురోగతిని వేగవంతం చేసి త్వరితగతిన శిక్షలు పడేలా చూడాలని జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్ పేర్కొన్నారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని పోలీస్‌స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని గురించి తెలుసుకున్నారు. సమన్లు, వారంట్ల అమలులో జాప్యం జరగకుండా చూడాలని, సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపర్చేలా చూడాలని ఆదేశించారు. ఎస్‌హెచ్‌ఓలు కేసుల పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తూ బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో జవాబుదారీతనంతో వ్యవహరిస్తూ పోలీసు శాఖపై మరింత నమ్మకం పెంచాల్సిన బాధ్యత ఉందన్నారు. సమావేశంలో డీసీఆర్‌బీ డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, సీఐ జార్జ్, సీఐ మహేశ్, ఎస్‌ఐలు, కోర్టు సీడీఓలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్


