మెదక్ ఆర్డీఓ రమాదేవి
పెద్దశంకరంపేట(మెదక్): భూ భారతిలో ప్రతీ అంగుళం భూమి డిజిటలైజేషన్ చేస్తామని మెదక్ ఆర్డీఓ రమాదేవి పేర్కొన్నారు. పెద్దశంకరంపేట మండలం శివాయపల్లిలో గురువారం నిర్వహించిన భూముల రీ సర్వే కార్యక్రమంలో ఆర్డీఓ పాల్గొని మాట్లాడారు. రైతులు సర్వే అధికారులకు సహకరించాలని, ప్రతీ భూమికి హద్దులు ఏర్పాటు చేయడంతో పాటు భూ ఆధార్ నంబర్ కేటాయిస్తామన్నారు. రైతులు భూముల విషయంలో ఆందోళన చెందవద్దని చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ సర్వేయర్ కిషన్, తహసీల్దార్ నారాయణ, డివిజనల్ సర్వేయర్ అజీమ్, సర్పంచ్ సంతోషి, ఆర్ఐ.నాగరాజు, సర్వేయర్ నాగరాణి తదితరులున్నారు.


