అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్‌సింగ్
మెదక్‌జోన్: బాధిత బాలలపట్ల పోలీసులు సున్నితరంగా, బాధ్యయుతంగా, గౌరవంగా వ్యవహరించాలని అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్‌సింగ్ పేర్కొన్నారు. ఎస్పీ కార్యాలయంలో గురువారం బాలలతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అదనపు ఎస్పీ హాజరై మాట్లాడారు. బాలల మానసిక స్థితిగతులను అర్థం చేసుకుని, వారికి భరోసా కల్పిస్తూ న్యాయం అందించాలని పేర్కొన్నారు. బాలలపై జరిగే నేరాల నివారణకు, బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో భరోసా, షీ టీమ్ సభ్యులతో పాటు జిల్లా వైద్యాధికారి పాల్గొన్నారు.


