మహిళా సంఘాలకు సాగు పనిముట్లు | - | Sakshi
Sakshi News home page

మహిళా సంఘాలకు సాగు పనిముట్లు

Oct 28 2026 8:18 AM | Updated on Oct 28 2026 8:18 AM

జిల్లా వ్యవసాయశాఖ అధికారి దేవ్‌కుమార్‌

చిన్నశంకరంపేట(మెదక్‌): మహిళా సమైక్య సంఘాలకు వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లను సబ్సిడీపై అందించనున్నట్లు వ్యవసాయశాఖ జిల్లా అధికారి దేవ్‌కుమార్‌ తెలిపారు. నార్సింగి మండల కేంద్రంలోని రైతువేదికలో మహిళ సంఘాల ప్రతినిధులు, పీఏసీఎస్‌ సిబ్బందితో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మహిళా సంఘాలు ప్రభుత్వం అందించే సబ్సిడీని సద్వినియోగం చేసుకుని వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లను కొనుగోలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. మహిళా సంఘాలు ప్రభుత్వ అందించే చేయూతను ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో డీసీఓ పద్మ, ఎంపీడీఓ తిరుపతి, ఐకేపీ ఏపీఎ సృజన్‌రెడ్డి, ఏఓ భరత్‌కుమార్‌, ఏఈఓలు జనార్ధన్‌, భువనేశ్వరి పాల్గొన్నారు.

డీలర్ల సంఘం రాష్ట్ర

ఉపాధ్యక్షుడిగా ఆనంద్‌

నర్సాపూర్‌: నర్సాపూర్‌కు చెందిన రేషన్‌ డీలర్‌ జిల్లా రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌కుమార్‌ రాష్ట్ర రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement