బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్
మెదక్‌జోన్: కాంగ్రెస్ నేతలకు దమ్మూ ధైర్యముంటే ఓటుచోరీ నిరూపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్ డిమాండ్ చేశారు. పట్టణంలోని రాందాస్‌చౌరస్తాలో మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఆధారాల్లేకుండా ఓటుచోరీ అంటూ బీజేపీపై లేనిపోని ఆరోపణలు చేయటంతోనే వారి దిష్టిబొమ్మలను దగ్ధం చేశామన్నారు. దేశంలో ఎక్కడ ఓటు చోరి జరిగిందో ఆధారాలతో పాటూ నిరూపించాలని సవాల్ విసిరారు. కార్యక్రమంలో నేతలు రంజిత్‌రెడ్డి, ప్రణీత, సురేశ్, సత్యనారాయణ, నాయిని ప్రసాద్, నల్లాల విజయ్ తదితరులు పాల్గొన్నారు.


