పెద్దశంకరంపేట(మెదక్): ధూపదీప నైవేద్య పథకంలో పనిచేస్తున్న అర్చకుల సమస్యలను పరిష్కరించాలని డీడీఎన్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వరశర్మ కోరారు. ఈమేరకు ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ కమిషనర్ విజయరామరావుకు సోమవారం సంగారెడ్డిలో వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా రాజేశ్వరశర్మ మాట్లాడుతూ.. అర్చక సంక్షేమ పథకాలపై గ్రామాల్లో పనిచేస్తున్న అర్చకులకు అవగాహన కల్పించాలని, ఆరోగ్యశ్రీ పథకంపై వివరించాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు. కార్యక్రమంలో రాష్ట్ర అర్చక సంఘం ఉపాధ్యక్షుడు గుడిచంద్రశేఖరశర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్, కోశాధికారి ప్రవీణ్‌శర్మ, సభ్యులు రాధాకృష్ణశర్మ తదితరులు పాల్గొన్నారు.


