మాకేది అల్పాహారం? | - | Sakshi
Sakshi News home page

మాకేది అల్పాహారం?

Oct 27 2026 8:22 AM | Updated on Oct 27 2026 8:22 AM

పాపన్నపేట(మెదక్‌): సర్కారు బడుల విద్యార్థులకు అల్పాహార పథకం ప్రారంభించి నెల రోజులు కావొస్తున్నా, ఇప్పటివరకు జిల్లాలో కేవలం 5 మండలాల్లోని 24,500 విద్యార్థులకు మాత్రమే అందుతుంది. మెదక్‌లో ఏర్పాటు చేసిన కేంద్రీకృత కిచెన్‌ షెడ్‌ నుంచి 40 వేల వి ద్యార్థులకు టిఫిన్లు అందింజే సామర్థ్యం ఉంది. కాగా, కామారెడ్డి, జోగిపేట, సిద్దిపేట జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న కిచెన్‌ షెడ్‌ల నుంచి మిగిలిన 30 వేల మంది విద్యార్థులకు టిఫిన్లు అందాల్సి ఉంది. అయితే అక్కడ కిచెన్‌షెడ్‌ల నిర్మాణంలో జాప్యం జరుగుతుండటంతో జిల్లాలోని కొన్ని మండలాల విద్యార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదని తెలుస్తుంది.

మంత్రి చేతుల మీదుగా ప్రారంభం

జిల్లాలో గత నెల 26న మంత్రి వివేక్‌, ఎమ్మెల్యే రోహిత్‌రావు చేతుల మీదుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహార పథకం ప్రారంభమైంది. హరేరామ హరేకృష్ణ సొసైటీ ఆధ్వర్యంలో మెదక్‌లో ఏర్పాటు చేసిన కేంద్రీకృత కిచెన్‌షెడ్‌ ద్వారా సుమారు 40 వేల మంది విద్యార్థులకు టిఫిన్లు అందించే అవకాశం ఉంది. కాగా జిల్లాలో 881 పాఠశాలలుండగా, 70వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. మిగితా 30 వేల మంది విద్యార్థులకు కామారెడ్డి, సిద్దిపేట, జోగిపేట పట్టణాల్లో ఏర్పాటు చేసే కిచెన్‌ షెడ్ల నుంచి టిఫిన్లు పంపిణీ చేస్తారు. అక్కడ షెడ్ల నిర్మాణం పూర్తి కాకపోవడం, ఇతరత్ర కారణాలతో జిల్లాలో నిర్దేశించిన పాఠశాలల విద్యార్థులకు అల్పాహార పథకం ప్రారంభం కాలేదు. ఇప్పటి వరకు జిల్లాలో మెదక్‌, హవేళిఘణాపూర్‌, రామాయంపేట, వెల్దుర్తి మండలాల విద్యార్థులకు టిఫిన్లు అందిస్తున్నారు. సోమ వారం పాపన్నపేట మండలంలో కొత్తగా అల్పాహారం పంపిణీ ప్రారంభించారు. ఇప్పటివరకు 24,500 మంది విద్యార్థులకు టిఫిన్లు అందిస్తున్నారు.

రోజుకో రకం టిఫిన్‌

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రోజుకో రకం టిఫిన్‌ అందిస్తున్నారు. సోమవారం దోశ చట్నీ, మంగళవారం ఇడ్లీ సాంబార్‌, బుధవారం పూరీ ఆలు కుర్మా, గురువారం బోండా చట్నీ, శుక్రవారం మిల్లెట్‌ ఉప్మా చట్నీ, శనివారం మిల్లెట్‌ ఇడ్లీ సాంబర్‌ అందించనున్నారు.

విద్యార్థులకు తప్పని ఎదురుచూపులు

ఇప్పటి వరకు 5 మండలాలకు విస్తరణ

జిల్లాలో 70 వేల మంది విద్యార్థులు

టిఫిన్లు చేస్తున్నది 24,500 మంది మాత్రమే

5 మండలాల విద్యార్థులకు టిఫిన్లు

మెదక్‌లో ఏర్పాటు చేసిన కేంద్రీకృత కిచెన్‌ షెడ్‌ ద్వారా 40 వేల మంది విద్యార్థులకు టిఫిన్లు అందజేసే సామర్థ్యం ఉంది. మిగితా 30 వేల మందికి కామారెడ్డి, సిద్దిపేట, జోగిపేట కేంద్రాల నుంచి టిఫిన్లు రావాలి. అక్కడ పనులు పూర్తి కానందున, జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు టిఫిన్లు అందడం లేదు.

– రాజు, డీఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement