మెదక్ కలెక్టరేట్: ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కలెక్టరేట్ నుంచే పొదుపు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం అధికారులతో ఎల్‌నినోపై సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్‌లో నీటిని, విద్యుత్‌ను ఉద్యోగులందరూ ఆదా చేయాలన్నారు. అ లాగే ‘మీ ప్రమాణం యాప్’లో తప్పనిసరిగా హాజరు నమోదు చేసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు ప్రజావాణిలో వివిధ మండలాల నుంచి 69 ఫిర్యాదులు వచ్చాయి. అనంతరం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అలాగే మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
చేగుంట(తూప్రాన్): నిబంధనలు పాటించని పరిశ్రమలతో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. చేగుంట శివారులోని జీవీకే పరిశ్రమ వద్ద పలు గ్రామాల ప్రజలు సోమవారం వంటావార్పుతో నిరసన తెలపగా, ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. జీవీకే పరిశ్రమతో గాలి, నీరు, కలుషితం అవుతుందన్నారు. కార్మికులకు సైతం సేఫ్టీ టూల్స్ అందించకుండానే పనులు చేయించుకుంటున్నారని తెలిపారు. స్పందించిన పరిశ్రమ నిర్వాహకుడు మోహన్ అగర్వాల్ అక్కడికి చేరుకొని కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సర్పంచ్‌లు రాజిరెడ్డి, సత్యనారాయణ, రేఖ, జ్యోతి, దుర్గాదేవితో పాటు బీఆర్‌ఎస్ నాయ కులు గ్రామాల రైతులు మహిళలు పాల్గొన్నారు.
ముదిరాజ్‌లను
బీసీ‘ఏ’లో చేర్చొద్దు
మెదక్‌జోన్: ముదిరాజ్‌లను బీసీ–ఏలో చేర్చే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో బీసీ–ఏలో ఉన్న వివిధ కులాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) రాస్తారోకో నిర్వహించింది. ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్థికంగా, రాజకీయంగా, అన్ని విధాలుగా ఎదిగిన ముదిరాజ్‌లను బీసీ–ఏలో చేర్చే కుట్రను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ సభ్యు లు సంగు స్వామి, చౌదరి మల్లేశం, పోతరాజు జనార్దన్, చౌదరి నవీన్, సంతోశ్, బక్కవారి శివ, లడ్డూ, లక్ష్మణ్, నాగరాజు, యాదగిరి, ఉపేంద్ర, గణేశ్, మహేశ్, వడ్డె సాయిలు, గంగిరెద్దుల మహేశ్ పాల్గొన్నారు.
తుపాకీతో బెదిరించి
దారి దోపిడీ
జహీరాబాద్: కోహీర్ మండలంలోని కవేలి శివారు 65వ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు దారి దోపిడీకి పాల్పడ్డారు. ఎస్‌ఐ నరేశ్ కథనం ప్రకారం.. గ్రామ శివారులో తెల్లవారుజామున మూత్ర విసర్జన చేసేందుకు డ్రైవర్ కారును ఆపాడు. అదే సమయంలో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కారు వద్దకు వచ్చి తుపాకీ, కత్తి చూపించారు. కారులో ఉన్న మహిళల వద్ద్ద నుంచి 3 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదును అపహరించుకుపోయారు. బాధితులు హైదరాబాద్‌లోని నారాయణగూడకు చెందిన వారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


