మెదక్ కలెక్టరేట్: సర్‌కు వ్యతిరేకంగా నవంబర్ 1న ‘ఓటు బచావో.. దేశ్ బచావో’ నినాదంతో చేపట్టే ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయా లని ఏఐసీసీ పరిశీలకుడు సరళ్ పటేల్ పిలుపునిచ్చారు. ఆదివారం డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయు లు గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సరళ్ పటేల్ మాట్లాడుతూ.. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైందన్నారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చూడాల్సిన బాధ్య త అందరిపై ఉందన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ నేపథ్యంలో ఓటర్ల హక్కులకు భంగం కలగకుండా కాంగ్రెస్ అప్రమత్తంగా ఉండాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సుమారు 15 లక్షల మంది ఓటర్లతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ కుమార్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అవినాశ్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేశ్‌గౌడ్, దుబ్బాక కాంగ్రెస్ ఇన్‌చార్జి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏఐసీసీ పరిశీలకుడు సరళ్ పటేల్


