కేటీఆర్, హరీశ్‌రావుపై జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ ఫైర్
తూప్రాన్: ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో ఎండల తీవ్రత పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే ఎండలు పెరిగాయంటూ బీఆర్ఎస్ నాయకులు హరీశ్‌రావు, కేటీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తూప్రాన్్లో పీఏసీఎస్ నూతన చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన ఉమ్మన్నగారి భాస్కర్‌రెడ్డితో పాటు నూతన డైరెక్టర్లను మంత్రి సన్మానించి మాట్లాడారు. తమ రాజకీయ ఆధిపత్యం కోసమే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వారి మాటలు నమ్మి ప్రజలు ఎవరూ మోసపోవద్దని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకుల అవినీతిని ప్రజల ముందు బయటపెట్టిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. కేవలం కమిషన్ల కక్కుర్తి కోసమే హరీశ్‌రావు సిద్దిపేటలో 1000 పడకల ఆస్పత్రి కట్టారని ఆరోపించారు. మల్లన్నసాగర్ బ్యారేజ్‌లో 51 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా నిర్మించినా, ప్రస్తుతం కేవలం 20 టీఎంసీలకే పరిమితమైందని విమర్శించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో దాదాపు రూ.10 వేల కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపించారు. నాయకులు, కార్యకర్తలు అంతర్గత విభేదాలు పక్కన పెట్టి కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, మహిపాల్‌రెడ్డి, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


