అదనపు కలెక్టర్ నగేశ్
నర్సాపూర్ రూరల్: భూ తగాదాల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ రీ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించిందని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. శుక్రవారం మండలంలోని తుల్జారాంపేట, రామచంద్రాపూర్ గ్రామాల్లో రీ సర్వేను ప్రారంభించి మాట్లాడారు. భూప్రక్షాళన చేసి ఎలాంటి భూ తగాదాలు లేకుండా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. భూ యజమాలతో పాటు సన్న, చిన్నకారు రైతులు సర్వే అధికారులకు సహకరించాలని కోరారు. హద్దులతో పాటు కొత్త సర్వే నంబర్లు ఇస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కవిత, ల్యాండ్ సర్వే ఏడీ కిషన్, ఆర్డీఓ రామకష్ణ, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐలు ప్రభాకర్, సిద్దిరాంరెడ్డి, మండల సర్వేయర్ అభిలాష్, కిషన్ నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.


