కలెక్టరేట్‌లో బతుకమ్మ సంబురాలు | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో బతుకమ్మ సంబురాలు

Oct 17 2026 7:48 AM | Updated on Oct 17 2026 7:48 AM

మెదక్‌ కలెక్టరేట్‌: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాలు, బతుకమ్మ పండుగల ఔనత్యాన్ని భావితరాలకు అందించాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా శాఖలలోని మహిళా ఉద్యో గులు రంగు రంగుల పూలతో అందమైన బతుకమ్మలు తయారు చేసుకొని వచ్చారు. గౌరిమాతకు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ పూజలు వేడుకలను ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్‌తోపాటు మహిళా ఉద్యోగులు, ఇతర మహిళలు బతుకమ్మ పాటలకనుగుణంగా నృత్యాలతో సందడి చేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. మహిళలను శక్తి స్వరూపిణులుగా గౌరవించే గొప్ప సంస్కృతి తెలంగాణ సొంతమన్నారు. అందమైన బతుకమ్మలు తయారు చేసిన డీఆర్డీఓ శాఖకు మొదటి బహుమతి, డీడబ్ల్యూఓకు ద్వితీయ బహుమతి, ఇంటర్మీడియెట్‌ శాఖకు తృతీయ బహుమతి అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నగేశ్‌, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, డీడబ్ల్యూఓ హేమభార్గవి, మెప్మా పీడీ హన్మంతరావుతో పాటు ఆయాశాఖల మహిళా ఉద్యోగులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

పూజలు చేసి ఆడిపాడిన కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement