నిబంధనలకు నీళ్లు | - | Sakshi
Sakshi News home page

నిబంధనలకు నీళ్లు

Sep 21 2026 7:23 AM | Updated on Sep 21 2026 7:23 AM

ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భవనాల నిర్మాణాలు కనీస నాణ్యతా ప్రమాణాలు కరువు అటువైపు కన్నెత్తి చూడని అధికారులు

ప్రభుత్వ భవనాల నిర్మాణాల్లో కనీస

నిబంధనలు కరువయ్యాయి. కలకాలం

మన్నికగా ఉండాల్సిన నిర్మాణాలకు

నాసిరకం ఇసుకను వాడుతున్నారు. పక్కనే మట్టిని తవ్వి పునాదులను నింపుతున్నారు. దీంతో నిర్మాణాల చుట్టూ పెద్ద పెద్ద గొయ్యిలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా భ వనాలు ఎంతకాలం మన్నికగా ఉంటాయనేది ప్రశ్నార్థకంగా మారింది.

– మెదక్‌జోన్‌

జిల్లాకు మెడికల్‌ కాలేజీ మంజూరు కావటంతో ఇందుకు సంబంధించిన భవన నిర్మాణాలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చింది. పట్టణ శివారులోని పిల్లికొటాల్‌ ఎంసీహెచ్‌ ఆస్పత్రి పక్కనే క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రి భవన నిర్మాణానికి రూ. 23.75 కోట్లు మంజూరు చేసింది. దాని పక్కనే నర్సింగ్‌ కాలేజీ భవన నిర్మాణానికి రూ. 25 కోట్లు అందజేసింది. అయితే వీటి నిర్మాణాలకు సమీపంలోని బొల్లారం మత్తిడి, పుష్పాలవాగులో ఏర్పాటు చేసిన ఇసుక ఫిల్టర్ల నుంచి తెచ్చిన నాసిరకం ఇసుకను వాడుతున్నారు. అందులో మట్టిశాతం అధికంగా ఉంటుంది. తక్కువ ధరకు లభిస్తుండటంతో సదరు కాంట్రాక్టర్లు దానిని వాడుతున్నారు. వర్క్‌ ఆర్డర్లలో మాత్రం నాణ్యమైన నదుల ఇసుకను వాడుతున్నట్లు చూపిస్తున్నారు.

ప్రమాదకరంగా గుంతలు

అలాగే క్రిటికల్‌ కేర్‌ భవన నిర్మాణానికి, ప్రస్తుతం నిర్మిస్తున్న నర్సింగ్‌ కాలేజీ నిర్మాణాలకు పక్కనే మట్టిని తవ్వి తీసి పునాది నింపుతున్నారు. దీంతో వాటి చుట్టూరా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. రహదారిని సైతం తవ్వడంతో మెదక్‌–చేగుంట ప్రధాన రహదారి నుంచి ఎంసీహెచ్‌ ఆస్పత్రికి వెళ్లే ప్రజలతో పాటూ తిమ్మక్కపల్లి తండా, డబుల్‌బెడ్రూం, జర్నలిస్టు కాలనీ, తిమ్మక్కపల్లి గ్రామానికి వెళ్లే ప్రజలు ఈ రోడ్డు నుంచే వెళ్తారు. నిత్యం వందలాది వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఆ గొయ్యిలో పడాల్సిందే. కనీస నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేస్తున్నా, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

చర్యలు తీసుకుంటాం

నర్సింగ్‌ కాలేజీ నిర్మాణానికి సంబంధించి మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ప్రభుత్వ భూముల నుంచి మట్టి తీయాలంటే అనుమతి తప్పనిసరి. అంతే కాకుండా ఆ ప్రాంతంలో ఎంసీహెచ్‌, క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రులు ఉన్నాయి. అక్కడి నుంచి మట్టి తీయటం ప్రమాదకరం. ఈ విషయం మా దృష్టికి రాలేదు. పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం.

– లక్ష్మణ్‌బాబు, మెదక్‌ తహసీల్దార్‌

ఎలాంటి ఇసుకై నా వాడొచ్చు

ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు ఎంలాంటి ఇసుక వాడినా పర్వాలేదు. కానీ నర్సింగ్‌ కాలేజీ పునాది నింపటం కోసం సమీపంలోని మట్టిని తవ్విన విషయం నా దృష్టికి రాలేదు. 15 రోజులుగా సైట్‌ వద్దకు వెళ్లలేదు. పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. – రవీందర్‌,

డీఈ, టీజీఎంఎస్‌ఐడీసీ

నిన్న క్రిటికల్‌ కేర్‌.. నేడు నర్సింగ్‌ కాలేజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement