హత్నూర(సంగారెడ్డి): మండల కేంద్రంలోని ఎస్టీ బాలికల వసతి గృహాన్ని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతి, తాగునీరు, పరిశుభ్రత ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు. వసతి గృహాల్లో పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో ఫోన్‌లో మాట్లాడి వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె వెంట సర్పంచ్ ఎల్లయ్య, నాయకులు ఉన్నారు.


