పీఆర్సీని వెంటనే ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

పీఆర్సీని వెంటనే ప్రకటించాలి

Sep 21 2026 7:23 AM | Updated on Sep 21 2026 7:23 AM

టీపీటీఎఫ్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): 51శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, టీపీటీఎఫ్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దామెర రాజయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన తిరుపతిరెడ్డి, దామెర రాజయ్య మాట్లాడుతూ...చర్చల పేరుతో ఉద్యోగ, ఉపాధ్యాయులను వంచించకుండా పీఆర్సీని వెంటనే ప్రకటించి అమలు చేయాలన్నారు. జూలై 2023 నుంచి అమలు చేయాల్సిన నూతన పీఆర్సీని ఆర్థికసాకుతో వాయిదా వేయడం తగదని హితవు పలికారు. డీఏలు పెండింగ్‌ లో పెట్టడం సరికాదని ఒకవేళ నిజంగా ఆర్థిక ఇబ్బందులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జిల్లాలకు టీజీఎల్‌ఐ కార్యాలయాలను కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఉపాధ్యాయ దర్శిని సంపాదకులు సందులపురం కనకయ్య, జిల్లా అధ్యక్షుడు చిట్యాల విజేందర్‌ రెడ్డి , జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్‌, రాష్ట్ర కౌన్సిలర్‌ జమీర్‌ మొహియోద్దిన్‌, జిల్లా ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement