విద్యుత్‌ తీగల చోరీ | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ తీగల చోరీ

Sep 21 2026 7:23 AM | Updated on Sep 21 2026 7:23 AM

చిలిపిచెడ్‌(నర్సాపూర్‌): మండలంలోని అజ్జమర్రి శివారులో మంజీరా నదీ పరివాహక ప్రాంతంలో బోరుబావుల వద్ద విద్యుత్‌ తీగలు చోరీకి గురయ్యాయి. శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 30 మంది రైతులకు చెందిన బోరుబావుల వద్ద ఉన్న విద్యుత్‌ తీగలను అపహరించినట్లు రైతులు తెలిపారు. పంటల సాగుకు కీలకమైన సమయంలో చోరీ జరగడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చోరీకి పాల్పడిన వారిని గుర్తించి, న్యాయం చేయాలని కోరారు. ఈ విషయమై ఎస్‌ఐ నర్సింలును వివరణ కోరగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

గణపతి సేవలో

ముస్లిం యువకుడు

పాపన్నపేట(మెదక్‌): మండల కేంద్రంలో జరుగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ఆదివారం పరమత సహనం వెల్లివిరిసింది. అడ్డా ఫ్రెండ్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద గ్రామానికి చెందిన పంచాయతీ వార్డు మెంబర్‌ చోటు ఎప్పటిలాగే తన సొంత ఖర్చులతో అన్నదానం నిర్వహించి పరమత సహనాన్ని చాటాడు. గ్రామస్తులు ఆయనను అభినందిస్తున్నారు.

కరాటేలో విద్యార్థుల ప్రతిభ

రామాయంపేట(మెదక్‌): హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన మార్షల్‌ ఆర్ట్స్‌ చాంపియన్‌ షిప్‌ కరాటే పోటీలో రామాయంపేట విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. బంగారు, వెండి పథకాలు గెలుపొందారు. మొత్తం 17 మంది పాల్గొన్న ఈ పోటీలో తొమ్మిది మంది గోల్డ్‌ మెడల్‌, నలుగురు సిల్వర్‌ మెడల్స్‌ సాధించారు. వీరిని కరాటే అసోసియేషన్‌ ప్రతినిధి రొయ్యల హరిప్రసాద్‌ అభినందించారు.

టీచర్ల పెండింగ్‌ సమస్యల్ని పరిష్కరిస్తాం

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): దీర్ఘకాలికంగా పెండింగ్‌లో వున్న ిపీఆర్సీ, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారంకోసం నిరంతరం కృషి చేస్తున్నామని పీఆర్టీయూటీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. సిద్దిపేటలో ఆదివారం ఏర్పాటు చేసిన పీఆర్టీయూఎస్‌ టీఎస్‌ జిల్లా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే పరిష్కరించే విధంగా ప్రాతినిధ్యం చేస్తున్నామన్నారు. మెరుగైన ఫిట్మెంట్‌తో పీఆర్సీని వెంటనే ప్రకటించేవిధంగా జేఏసీ ద్వారా ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు. సంస్థ జిల్లా మండల శాఖలను మరింత బలోపేతం చేసి క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులకు అందుబాటులో వుండి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్రనాయకులు చంద్రశేఖర్‌రావు, శశియాదవ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష ప్రధానకార్యదర్శులు పన్యాల జనార్ధన్‌రెడ్డి, సమ్మయ్య, నాయకులు ఆనంద్‌రెడ్డి, యమరాజు, మధు, ప్రవీణ్‌, పరమేశ్వర్‌, తిరుపతి, నర్సింహులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement