డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి
నారాయణఖేడ్: డీసీసీ అధ్యక్షుడిగా నూతనంగా నియామకం అయిన పట్లోళ్ళ చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం ఆయన సోదరుడు ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి హైదరాబాద్‌లో పలువురు కాంగ్రెస్ నేతలను మర్యాదపూర్వకంగా కలిశారు. టీసీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర, సీతక్క, ఎంపీ సురేశ్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో డీసీసీ బాధ్యతలు అప్పగించినందుకు కాంగ్రెస్ ఆధిష్టానానికి, రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి జిల్లాలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఆయన వెంట ఆత్మ చైర్మన్ వినోద్ పాటిల్, నాయకులు పండరిరెడ్డి, విఠల్‌రావుపాటిల్ ఉన్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి


