మక్కబుట్టలు ఎంతమ్మా..? | - | Sakshi
Sakshi News home page

మక్కబుట్టలు ఎంతమ్మా..?

Sep 21 2026 7:23 AM | Updated on Sep 21 2026 7:23 AM

వట్‌పల్లి పర్యటనలో చిరు వ్యాపారితో మంత్రి దామోదర రాజనర్సింహ

వట్‌పల్లి పర్యటనలో చిరు వ్యాపారితో మంత్రి దామోదర రాజనర్సింహ

జోగిపేట(అందోల్‌): మక్కబుట్టలు ఒకటి ఎంతమ్మా.. వ్యాపారం బాగా సాగుతుందా.. ప్రతి రోజు ఎన్ని విక్రయిస్తున్నావు..? అంటూ మంత్రి దామోదర రాజనర్సింహ అందోల్‌ మండలం సంగుపేట శివారులోని జాతీయ రహదారికి పక్కన మక్క బుట్టలు అమ్ముతున్న మహిళను అడిగారు. ఆదివారం వట్‌పల్లి మండల పర్యటనకు వెళ్తూ మార్గమధ్యలో సంగుపేట వద్ద ఆగి మక్క బుట్టలు కొనుగోలు చేశారు. స్వయంగా మంత్రే తన వద్దకు కారు దిగి రావడంతో మహిళ సంతోషం వ్యక్తం చేసింది. రూ.20కి ఒకటి చొప్పున అమ్ముతున్నా సార్‌.. వ్యాపారం బాగానే జరుగుతుందని, పొట్ట కూటి కోసం ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ మక్క బుట్టలు అమ్ముకుంటున్నానని తెలిపింది. అనంతరం మంత్రికి ఒక మక్క బుట్టను ఇచ్చింది. వెంటనే ఆమెకు మంత్రి రూ.100 ఇచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement