దరఖాస్తుల పరిశీలన
● బీడీ కార్మికులు, వృద్ధులపై స్పష్టత కరువు
● 31 వరకు దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు
మెదక్ కలెక్టరేట్: వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో జిల్లాలోని అర్హుల్లో ఆశలు చిగురించాయి. ఇదే క్రమంలో బీడీ కార్మికులు, వృద్ధాప్య పింఛన్లపై స్పష్టత లేకపోవడంతో వారిలో ఆందోళన నెలకొంది. పది రకాల పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రకటించిన సర్కారు, వీరివి మాత్రం తర్వాత చూస్తామంటూ ప్రకటించింది. అయితే వితంతు, దివ్యాంగులు, గీత కార్మికులు, ఒంటరి మహిళలు, డయాలసిస్, పైలేరియా, చేనేత కార్మికుల దరఖాస్తులు స్వీకరిస్తుంది.
జిల్లాలో 1.6 లక్షల పింఛన్లు
జిల్లాలో ఇప్పటికే 1.6 లక్షల మందికి ప్రభుత్వం వివిధ రకాల పింఛన్లు అందజేస్తుంది. ప్రతీనెల వీరికి సుమారు రూ.23 కోట్ల పైచిలుకు అందజేస్తుంది. ఇదే క్రమంలో అర్హులు ఈనెల 31లోగా అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు సుమారు 8 వేల వరకు దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. జిల్లాలో దరఖాస్తుదారుల సమస్యలు తెలుసుకునేందుకు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల వద్ద ప్రజలకు అవగాహన సైతం కల్పిస్తున్నారు. కాగా, ఇప్పటికే 90 శాతం ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
నా వయసు 66 ఏళ్లు. నా భర్త చనిపోయి 20 ఏళ్లు అవుతుంది. అప్పు డు అవగాహన లేక డెత్ సర్టిఫికెట్ తీసుకోలేదు. అయితే అంగన్‌వాడీ ఆయాగా పనిచేయడంతో వితంతు పింఛన్ ఇవ్వలేదు. ప్రస్తుతం వయసు మీద పడింది. ప్రభుత్వం స్పందించి ఏదో ఒక పింఛన్ మంజూరు చేయాలి – భాగమ్మ, అంసాన్‌పల్లి, కొల్చారం
జిల్లాలో పింఛన్లు పొందుతున్న వారు
రామాయంపేట(మెదక్): పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మండలంలోని ప్రగతి ధర్మారంలో శుక్రవారం కొత్త ఫించన్ల దరఖాస్తులను అధికారులు పరిశీలించారు. సెర్ప్ డైరెక్టర్ గోపాల్‌రావు, డీఆర్డీఓ శ్రీనివాసరావు, ఇతర అధికారులు ఇంటింటికీ తిరిగి క్షేత్రస్థాయిలో దరఖాస్తులు పరిశీలించారు. వారి వెంట ఎంపీడీఓ సజీలుద్దీన్, మండల వ్యవ సాయ అధికారి ప్రవీణ్‌కుమార్, సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, వార్డు సభ్యులు ఉన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకే..
వృద్ధులు, బీడీ కార్మికుల దరఖాస్తుల స్వీకరించొద్దని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. అయితే వృద్ధులు, బీడీ కార్మికుల దరఖాస్తు లు స్వీకరిస్తున్నాం. కాని ఆన్‌లైన్ చేయడం లేదు. ఈనెల 31 వరకు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం. అనంతరం వాటి పై విచారణ చేస్తాం.
– భీమయ్య, డీపీఎం
బీడీ కార్మికులు 15,610
వృద్ధులు 34,662
వితంతువు 42,587
దివ్యాంగులు 7,851
కల్లుగీత కార్మికులు 818
చేనేత కార్మికులు 437
పైలేరియా 454
డయాలసిస్ 184
ఒంటరి మహిళలు 4,070


