డుమ్మా టీచర్లకు కళ్లెం
జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు కలిపి మొత్తం 905 ఉన్నాయి. వాటి పరిధిలో ఎంఈఓలు, ఉపాధ్యాయులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సీఆర్‌పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు కలిపి మొత్తం 4,498 మంది ఉన్నారు. వీరంతా ఎఫ్‌ఆర్‌ఎస్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రతి ఉపాధ్యాయుడితో పాటు బోధనేతర సిబ్బంది సైతం విధులు నిర్వర్తించే చోటు నుంచి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు సార్లు తప్పనిసరిగా ఎఫ్‌ఆర్‌ఎస్ వేయాలి. లేనిచో ఆరోజు ఆబ్సెంట్ పడుతుంది. పాఠశాల పరిధి నుంచే వేయాలి. మరో చోట ఉండి ఎఫ్‌ఆర్‌ఎస్ వేస్తామంటే కుదరదు. అలాగే బడికి సెలవు పెట్టినా దీనిలోనే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
బోధన మెరుగుపడేనా?
డుమ్మా టీచర్లకు కళ్లెం పడటంతో ఇకనైనా సర్కార్ బడుల్లో బోధన మెరుగు పడేనా..? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అలాగే టీచర్లు వారి పిల్లలను ప్రైవేట్‌కు పంపకుండా ప్రభుత్వ బడులకు పంపే విధంగా చర్యలు తీసుకుంటే బోధనలో మార్పు వస్తోందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఏటా సర్కార్ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గి ప్రైవేట్ బడుల్లో ప్రవేశాలు పెరుగుతున్నాయి.
విధులు నిర్వర్తించే చోటు నుంచి ఫొటో క్యాప్చర్
త్వరలో జీతాలకు లింకు
జిల్లాలో 905 ప్రభుత్వ పాఠశాలలు
ఐదు అంకెల జీతం తీసుకుంటూ విధులకు ఎగనామం పెట్టే ఉపాధ్యాయులకు ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫేషియల్ రికగ్నేషన్ సిస్టం)తో చెక్ పడింది. ప్రతిరోజు విధులు నిర్వర్తించే చోటు నుంచే సకాలంలో ఫొటో క్యాప్చర్ చేయాల్సి రావటంతో పంతుళ్లు విధిగా విధులకు హాజరవుతున్నారు. కాగా, త్వరలో ఎఫ్‌ఆర్‌ఎస్ ఆధారంగానే వేతనాలు విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తునట్లు తెలిసింది. – మెదక్‌జోన్


