చిలప్‌చెడ్(నర్సాపూర్): మండల పరిధిలోని చిట్కుల్ శివారులో గల కేజీబీవీలో ఇంటర్మీడియెట్ బైపీసీ గ్రూపు సబ్జెక్టులను బోధించేందుకు అర్హులైన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని కేజీబీవీ ప్రత్యేకాధికారి అంజలి కోరారు. సోమవారం ఆమె మాట్లాడుతూ గత యేడాది తమ విద్యాలయానికి ఇంటర్మీడియెట్ బైపీసీ మంజూరైన విషయం విదితమే. బైపీసీ విద్యార్థులకు ఆంగ్లం, తెలుగుతో పాటు, భౌతిక, రసాయన, జీవశాస్త్రాలు బోధించేందుకు, సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు, బీఈడీ పూర్తయితే టెట్ అర్హత ఉన్న, ఆసక్తి గల మహిళలు, తమ విద్యార్హత పత్రాలు తీసుకువచ్చి చిట్కుల్ కేజీబీవీలో సంప్రదించాలని కోరారు. ఈ నెల 15 తేదీన పాఠశాల నోటీస్‌బోర్డుపై మెరిట్ లిస్ట్ ప్రదర్శిస్తామన్నారు.
చిన్నశంకరంపేట(మెదక్): మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్‌లో నైట్ వాచ్ ఉమెన్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హాస్టల్ కేర్ టేకర్ మాధురి తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి, 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు మహిళా అభ్యర్థులు ఈ నెల 13 వరకు దరఖాస్తులు అందించాలని కోరారు. ఎంపికై న అభ్యర్థికి రూ.8,710 వేతనం ఉంటుందని ఆమె తెలిపారు.
నిజాంపేట(మెదక్): నిజాంపేట మండల కేంద్రంలోని జనగణనపై సోమవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తహసీల్దార్ శ్రీనివాస్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు సిబ్బంది జనగణనలో ఉన్న గృహగణన వివరాలు సేకరించిన వాటి తుది జాబితాను ఆన్‌లైన్లో ఏవిధంగా పొందుపరచాలో వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రమ్యశ్రీ, సీనియర్ అసిస్టెంట్ రమేష్, రామ్మోహన్‌శర్మ పాల్గొన్నారు.
జిల్లా సర్పంచుల ఫోరం
ఉపాధ్యక్షుడు కృష్ణాగౌడ్
మెదక్ కలెక్టరేట్: కౌడిపల్లిలోని గ్రంథాలయం శిథిలావస్థకు చేరుకుందని, వెంటనే దాన్ని సొంత భవనంలోకి మార్చాలని జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడు చంద్రం కృష్ణాగౌడ్ కోరారు. సోమవారం మెదక్ కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో డీఆర్‌ఓ అంబదాస్ రాజేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కౌడిపల్లి మండల కేంద్రంలో గ్రంథాలయ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నట్లు తెలిపారు. దీంతో గ్రంథాలయానికి వచ్చే విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులు, పాఠకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. మండల కార్యాలయం ఆవరణలో గ్రంథాలయం కోసం సొంత భవనం నిర్మించి అలాగే వదిలేశారని తెలిపారు. ఇప్పటికై నా గ్రంథాలయాన్ని ఆ భవనంలోకి తరలించాలని కోరారు. ఆయన వెంట జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా, దేవేందర్ తదితరులు ఉన్నారు.
వ్యవసాయాధికారి కృష్ణ
పెద్దశంకరంపేట(మెదక్): ఎరువులు, విత్తనాలను ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని తహసీల్దార్ నారాయణ, ఏఓ కృష్ణ సూచించారు. సోమ వారం స్థానిక రైతువేదికలో ఫర్టిలైజర్ దుకాణాల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని, స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు నోటీసు బోర్డులో ఉంచాలన్నారు. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ విక్రయాలు జరపాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఈఓలు వినీత్, అఖిల్ తదితరులున్నారు.
కౌడిపల్లి(నర్సాపూర్): మండల కేంద్రమైన కౌడిపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సోమవారం ప్రిన్సిపాల్ వెంకటసుబ్బయ్య, లెక్చరర్లు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో మెరుగైన విద్యాబోధన జరుగుతుందని చెప్పారు. కళాశాల ప్రారంభం కాగానే విద్యార్థుల సౌకర్యం కోసం పుస్తకాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు సురేందర్‌రెడ్డి, మాణికాంతరావు, చంద్రయ్య, గిరిధర్‌రావు, దుర్గయ్య, శ్రీనివాస్‌గౌడ్, ప్రసన్నలక్ష్మి, మధురశ్రీ, లైబ్రేరియన్ మాధవి తదితరులు పాల్గొన్నారు.


