ప్రజల సహకారం అవసరం | - | Sakshi
Sakshi News home page

ప్రజల సహకారం అవసరం

Jun 9 2026 8:34 AM | Updated on Jun 9 2026 8:34 AM

రామాయంపేట(మెదక్‌): మెదక్‌ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌ సహకారంతో పట్టణాభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జి.లావణ్య పేర్కొన్నారు. సోమవారం నాలుగు, ఎనిమిది, తొమ్మిదో వార్డులో నిర్వహించిన వార్డు సభల్లో పాల్గొన్న ఆమె మాట్లాడారు. అభివృద్ధి విషయమై ప్రజల సహకారం ఎంతైనా అవసరమన్నారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేసి ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని చైర్మన్‌ సూచించారు.

బీఆర్‌ఎస్‌ నిరసన

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ నాయకుడు అహ్మద్‌ చెవిలో పూవు పెట్టుకొని సమావేశంలో నిరసన తెలిపారు. గత ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను చాలా వరకు అమలు చేయలేదని, దీంతో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని ఆయన విమర్శించారు. అహ్మద్‌ మాట్లాడుతున్న క్రమంలో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు అడ్డుతగిలారు. దీంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం కొనసాగింది. వార్డుల్లో నెలకొన్న సమస్యల విషయమై స్థానికులు చైర్మన్‌, కమిషనర్‌కు వినతిపత్రాలు అందజేశారు. తహసీల్దార్‌ రజనీ, మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌, కౌన్సిలర్లు నాగరాజు, రంజిత్‌, రవి, శంకర్‌గౌడ్‌, పుట్టి సందీప్‌, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ చైర్మన్‌ లావణ్య

Advertisement
 
Advertisement
Advertisement