మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి
నర్సాపూర్: ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వార్డు సభలను నిర్వహిస్తున్నామని మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి చెప్పారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సోమవారం పట్టణంలోని పలు వార్డు సభలు నిర్వహించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆయా వార్డు సభలలో మున్సిపల్ కమిషనర్ సాయికుమార్, వైస్ చైర్మన్ బుచ్చేష్‌యాదవ్, మేనేజర్ మధుసూదన్, కౌన్సిలర్లు రాజమణి, సమీనాబేగం, రాజు, సుధీర్‌గౌడ్, ప్యాక్స్ చైర్మన్ రాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కోతులు పట్టే పనులు ప్రారంభం
పట్టణంలో కోతుల బెడద నుంచి ప్రజలను కాపాడేందుకు మున్సిపల్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టినట్టు చైర్‌పర్సన్ లక్ష్మి, వైస్ చైర్మన్ బుచ్చెష్‌యాదవ్‌లు చెప్పారు. సోమవారం కోతులు పట్టే పనులను వారు ప్రారంభించారు.


