జాతర ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

జాతర ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

Jun 9 2026 8:34 AM | Updated on Jun 9 2026 8:34 AM

చేగుంట(తూప్రాన్‌): మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన జాతర ఉత్సవాల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. చందాయిపేట గ్రామంలోని దుర్గమ్మ జాతర ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. కర్నాల్‌పల్లి గ్రామంలో బీరప్ప విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని పూజలను నిర్వహించారు. గ్రామ దేవతల ఆశీర్వాదాలతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌ మహేశ్వరీ, ఉత్వకమిటీ సభ్యులు సాయిబాబా, నగేష్‌, యాదగిరి, అంజనేయులు, శోభన్‌, రమేశ్‌, బూదయ్య, మల్లయ్య పాల్గొన్నారు.

వెంకటాపూర్‌లో బీరప్ప జాతర ఉత్సవాలు

రామాయంపేట(మెదక్‌): మండలంలోని వెంకటాపూర్‌ (ఆర్‌)లో సోమవారం బీరప్ప జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. యాదవ సంఘం సభ్యులతోపాటు గ్రామ సర్పంచ్‌ ఉమ, ఉప సర్పంచ్‌ అనురాధ, వార్డు సభ్యులు నాగరాణి, రేవతి తదితరులు బోనాలు ఎత్తుకొని గ్రామం నుంచి ఆలయం వద్దకు వెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement