ఆకట్టుకున్న పోతరాజుల విన్యాసాలు | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న పోతరాజుల విన్యాసాలు

Jun 8 2026 9:35 AM | Updated on Jun 8 2026 9:35 AM

నర్సాపూర్‌ రూరల్‌: మండలంలోని గొల్లపల్లిలో వెలసిన రేణుక పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం గౌడ సంఘం ఆధ్వర్యంలో లందా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు రేణుక పరమేశ్వరి అమ్మవారి విగ్రహ దాత బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్దాస్‌ మల్లేష్‌ గౌడ్‌, గౌడ సంఘం సభ్యులు కలిసి పూజాలో పాల్గొన్నారు. అలాగే ఎస్సీ వాడలో గతేడాదిలో నిర్మించిన రేణుక పరమేశ్వరి అమ్మవారి ఆలయ మొదటి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన ఊరేగింపులో యువకులు, పోతరాజులు, శివ సత్తుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి గౌడ సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement