హవేళిఘణాపూర్(మెదక్): మెదక్ మండల పరిధిలోని పాతూర్ మీదుగా కొత్తగా నిర్మించిన జాతీయ రహదారి ఆ గ్రామానికి సరికొత్త రూపురేఖలను తీసుకొచ్చింది. గతంలో ఇరుకు రోడ్లతో తీవ్ర ఇబ్బందులు పడిన వాహనదారులు, ప్రయాణికులకు ఈ హైవే నిర్మాణంతో ఉపశమనం లభించింది. గతంలో గుంతలపై ఇబ్బందులు పడగా.. ప్రస్తుతం ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న ఈ రహదారి గ్రామానికి సరికొత్త కల తీసుకురావడంతోపాటు చూపరులను సైతం ఎంతగానో ఆకట్టుకుంటోంది.
సాఫీగా సాగుతున్న ప్రయాణం


