రేగోడ్(మెదక్)/చేగుంట(తూప్రాన్)/పెద్దశంకరంపేట(మెదక్): జిల్లాలో ఆదివారం పలు చోట్ల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు ఘనంగా జరిగాయి. రేగోడ్‌లో 2004–05 సంవత్సరం, తూప్రాన్ మండలంలోని మక్కరాజీపేటలో 2010–11 బ్యాచ్ పదోతరగతి, పెద్దశంకరంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో 1983–84వ సంవత్సరంలో ఎస్సెస్సీ పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు ఒకరికొకరు ఆప్యాయతగా మాట్లాడుకున్నారు. తమకు బోధించిన ఉపాధ్యాయులు, గురువులు లక్ష్మణ్, జనార్దన్‌రెడ్డి, శ్రీధర్, ప్రాన్సిస్‌శౌరీ, రిటైర్డు ఉపాధ్యాయుడు రంగారెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగేశ్వర్‌రావు, దయానంద్, బేతయ్య పాల్గొన్నారు.


