పార్కింగ్ లేక పరేషాన్
దుబ్బాకటౌన్: దుబ్బాక పట్టణంలో ప్రతి శనివారం నిర్వహించే కూరగాయల సంతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం కాగానే సంతకు వచ్చే వారు పార్కింగ్ లేక రోడ్డుపైనే వాహనాలు నిలుపుతున్నారు. దీంతో రోడ్డుపై వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ట్రాఫిక్ క్లియర్ చేయలేక పోలీసులు నానాతంటాలు పడుతున్నారు.
ఉచిత వైద్య శిబిరం
బెజ్జంకి(సిద్దిపేట): కరీంనగర్‌కు చెందిన సుప్రీ మ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో మండలంలోని గాగిళ్లాపూర్‌లో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. బీపీ, షుగర్, హిమోగ్లోబిన్, సీబీసీ, ఈసీజీ లాంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. సర్పంచ్ జానకి, వైద్యులు తిరుపతి, ఉపసర్పంచ్ పద్మ, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఎంఈఓ బాలరాజు
కౌడిపల్లి(నర్సాపూర్): కౌడిపల్లి మండలానికి మరో అయిదు ప్రీ ప్రైమరీ పాఠశాలలు మంజూరైనట్టు ఎంఈఓ బాలరాజు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ గతేడాది నుంచి కౌడిపల్లి, ముట్రాజ్‌పల్లి, పీర్యతండాతోపాటు భుజిరంపేట పీఎంశ్రీ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ కొనసాగుతుందన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి రాజిపేట, సలాబత్‌పూర్, వెల్మకన్న, తునికి, కూకుట్లపల్లి ప్రాథమిక పాఠశాలకు ప్రీ ప్రైమరీ మంజూరైనట్లు చెప్పారు. టీచర్లు, ఆయా పొస్టులు భర్తీచేసి నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ బోధన ప్రారంభిస్తారని తెలిపారు. ఆయా గ్రామాలలో అర్హులైన వారు 9వ తేదీలోపు ఆయా పాఠశాలల హెచ్‌ఎంలకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.