సొంత నిధులతో కమ్యూనిటీ భవనం | - | Sakshi
Sakshi News home page

సొంత నిధులతో కమ్యూనిటీ భవనం

Jun 8 2026 9:35 AM | Updated on Jun 8 2026 9:35 AM

నిజాంపేట(మెదక్‌): తన జీవిత సహచరి అందె శకుంతల దేవి జ్ఞాపకార్థం ప్రముఖ సామాజిక సేవకుడు, దాత అందె ప్రతాప్‌ రెడ్డి సొంత నిధులతో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ఆదివారం గ్రామ ప్రజలకు అంకితం చేశారు. మండల పరిధిలోని ఖాసీంపూర్‌ గ్రామంలో రూ. 37 లక్షలతో కమ్యూనిటీ భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఈ భవనాన్ని గ్రామస్తులు శుభకార్యాలు, గ్రామ సభలు, సాంస్కృతిక, విద్యా సంబంధిత కార్యక్రమాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు ప్రతాప్‌ రెడ్డి సేవాభావాన్ని కొనియాడారు. కార్యక్రమంలో ఖాసీంపూర్‌ సర్పంచ్‌ కనకరాజు, ఉపసర్పంచ్‌ రమేశ్‌, వార్డు సభ్యులు, కల్వకుంట గ్రామ సర్పంచ్‌ అందె కొండల్‌ రెడ్డి, బాలాజీ అమైన్స్‌ ప్రతినిధి నరేందర్‌ రెడ్డి , గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గ్రామస్తుల ప్రశంసలు

Advertisement
 
Advertisement
Advertisement