ఓటర్‌ మ్యాపింగ్‌ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

ఓటర్‌ మ్యాపింగ్‌ తప్పనిసరి

Jun 8 2026 9:35 AM | Updated on Jun 8 2026 9:35 AM

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలో సోమవారంతో ఓటరు మ్యాపింగ్‌ ప్రక్రియ ముగియనుందని, అర్హులైన ఓటర్లంతా తప్పనిసరిగా ఓటరు మ్యాపింగ్‌ చేసుకోవాలని మెదక్‌ తహసీల్దార్‌ లక్ష్మణ్‌బాబు సూచించారు. ఆదివారం పట్టణంలోని జంబికుంట వీధిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. బీఎల్‌ఓలు ఎలాంటి తప్పులు లేకుండా ఓటరు మ్యాపింగ్‌ ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. అధికారులు ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు ఓటర్లు తమ వివరాలను సరిచేసుకోవాలన్నారు. లేదంటే ఓట్లు తొలగింపబడతాయని తెలిపారు. ఈనెల 10వ తేదీ అనంతరం ఇంకా మ్యాపింగ్‌ చేసుకోని ఓటర్లకు నమోదు పత్రాలు ఇస్తామని, వాటి ద్వారా సరి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement