కుంభవృష్టితో మెతుకుసీమ అతలాకుతలం | - | Sakshi
Sakshi News home page

కుంభవృష్టితో మెతుకుసీమ అతలాకుతలం

Aug 29 2025 6:55 AM | Updated on Aug 29 2025 9:44 AM

-
శుక్రవారం శ్రీ 29 శ్రీ ఆగస్టు శ్రీ 2025

న్యూస్‌రీల్‌

అత్యధికంగా సర్దనలో 31 సె.మీ వర్షపాతం నీట మునిగిన వేలాది ఎకరాల పంటలు తెగిన రోడ్లు, బ్రిడ్జిలు, చెరువులు నిలిచిన రాకపోకలు.. స్తంభించిన జనజీవనం రాజిపేట బ్రిడ్జి వద్ద కొట్టుకుపోయిన ఇద్దరు ఒకరి మృతదేహం లభ్యం.. మరొకరు గల్లంతు 9 మందిని కాపాడిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు

మెదక్‌జోన్‌/రామాయంపేట/హవేళిఘణాపూర్‌/చిన్నశంకరంపేట/పాపన్నపేట/మెదక్‌ మున్సిపాలి టీ: మెతుకుసీమను వర్షాలు ముంచెత్తాయి. అత్యధికంగా హవేళిఘణాపూర్‌ మండలం సర్దనలో 31.6 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. మంజీరా, హల్దీ, ఘనపూర్‌ ప్రాజెక్ట్‌లు పొంగిపొర్లాయి. రహదారులు ఎక్కడికక్కడ తెగిపోయాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా, జనజీవనం స్తంభించింది. వరదల్లో 12 మంది చిక్కుకోగా, 9 మందిని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు కాపాడాయి. మరో ఇద్దరు గల్లంతు కాగా, ఒకరి మృతదేహం లభ్యమైంది. మెదక్‌– కామారెడ్డి జిల్లాల సరిహద్దులోని పోచారం ప్రాజెక్ట్‌కు గండిపడటంతో దాని దిగువ ప్రాంతంలోని సర్దన, పోచమ్మరాల్‌, జక్కన్నపేట గ్రామాలకు చెందిన 500 మందిని మెదక్‌ పట్టణంలోని పునరావాస కేంద్రాలకు తరలించారు. రాజిపేట తండాకు చెందిన మాలోత్‌ హరిత గురువారం పురిటినొప్పులతో బాధపడుతుండగా, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం ఆమెను సురక్షితంగా మెదక్‌ ఎంసీహెచ్‌ ఆస్పత్రికి తరలించారు. 

జిల్లా కేంద్రంలోని పసుపులేరు ఒడ్డున గల సబ్‌స్టేషన్‌ నీటి మునగగా, విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మెదక్‌ పట్టణంలో ఓ ఇంటి ఆవరణలో బుధవారం పిడుగుపడింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. సింగూర్‌ ప్రాజెక్టు నుంచి దిగువన గల ఘనపూర్‌కు 20 వేల క్యూసెక్కుల నీటిని వదలడంతో పాపన్నపేట మండలంలోని కుర్తివాడ, యూసుపేట మధ్య రోడ్డుపై వరద ఉధృతంగా ప్రవహించి రాకపోకలకు అంతరాయం కలిగింది. అలాగే మెదక్‌– బొడ్మట్‌పల్లి ప్రాంతంలోని పేరూరు బ్రిడ్జిపై నీరు ప్రవహించటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వెల్దుర్తి– ఉప్పులింగాపూర్‌ మధ్య గల బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహించి రాకపోకలు స్తంభించాయి. మంజీరా పొంగి పొర్లుతుండటంతో దిగువన వేలాది ఎకరాల వరి నీట మునిగింది. నదిలో ఏర్పాటు చేసిన మోటార్లు కొట్టుకుపోయాయి. 

నార్సింగిలో గుండువాగు పొంగిపొర్లడంతో 44వ జాతీయ రహదారిపై నీరు భారీగా చేరింది. కొద్దిసేపు వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేశారు. రామాయంపేట పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. పలు కాలనీలు నీట మునిగాయి. ఎస్సీ మహిళా డిగ్రీ కళాశాల, ఇంటర్‌ బాలికల హాస్టల్‌ చుట్టూ వరద చేరటంతో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం విద్యార్థినులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. చిన్నశంకరంపేట మండలం శాలిపేటలో నీటి కుంటతెగిపోయి పెద్ద ఎత్తున పంటలకు నష్టం జరిగింది. కొల్చారం మండలం తుక్కాపూర్‌కు చెందిన టేక్మాల్‌ ప్రమీల నదిలో గల్లంతు కాగా, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు నదిలో గాలిస్తున్నాయి. ఇదే మండలం సంగాయిపేట చెరువు గండిపడి రహదారిపై నీరు ప్రవహిస్తోంది. దీంతో శెట్టిపల్లి, వెంకటాపూర్‌, వరిగుంతం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

వరుణుడి ప్రతాపానికి మెతుకుసీమ చిగురుటాకులా వణికింది. రెండు రోజులుగా కురుస్తున్న కుంభవృష్టితో అతలాకుతలం అయింది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండగా, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నివాసాలు నీట మునిగాయి. ఆస్తి, ప్రాణ నష్టం జరగగా, వేలాది ఎకరాల్లో

 

11 మండలాల్లో అత్యధికం

రెండు రోజులుగా 11 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. చేగుంట మండలంలో 231.8 మి.మీ, రామాయంపేటలో మి.మీ నమోదు కాగా, మెదక్‌లో 196.8 మి.మీ, కొల్చారంలో 166.3 మి.మీ, వెల్దుర్తి 148 మి.మీ, నార్సింగి 142 ఎంఎం, నిజాంపేట 140 మి.మీ, తూప్రాన్‌ 130.3 మి.మీ, పెద్దశంకరంపేట 123.8 మి.మీ, టేక్మాల్‌ 120.5 మి.మీ నమోదు అయింది.

కుంభవృష్టితో మెతుకుసీమ అతలాకుతలం1
1/5

కుంభవృష్టితో మెతుకుసీమ అతలాకుతలం

కుంభవృష్టితో మెతుకుసీమ అతలాకుతలం2
2/5

కుంభవృష్టితో మెతుకుసీమ అతలాకుతలం

కుంభవృష్టితో మెతుకుసీమ అతలాకుతలం3
3/5

కుంభవృష్టితో మెతుకుసీమ అతలాకుతలం

కుంభవృష్టితో మెతుకుసీమ అతలాకుతలం4
4/5

కుంభవృష్టితో మెతుకుసీమ అతలాకుతలం

కుంభవృష్టితో మెతుకుసీమ అతలాకుతలం5
5/5

కుంభవృష్టితో మెతుకుసీమ అతలాకుతలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement