
పండుగ పూట ఆర్తనాదాలు
హవేళిఘణాపూర్ మండలం దూప్‌సింగ్ తండాను వరద నీరు చుట్టుముట్టింది. కామారెడ్డి జిల్లా నుంచి వచ్చిన గంగమ్మవాగు ఉధృతితో తండా చుట్టూ నీరు చేరింది. దీంతో తండావాసులు తమను ఆదుకోండి అంటూ ఆర్తనాదాలు పెట్టారు. ఆ తండాకు వెళ్లేందుకు దారి లేక ఇబ్బందులు పడ్డారు. అలాగే కామారెడ్డి– మెదక్ జిల్లా సరిహద్దులో ఉన్న పోచారం డ్యామ్ తెగిపోతుందన్న విషయం తెలుసుకున్న సర్దన గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ భయంగుప్పిట్లో గడిపారు. విషయం తెలుసుకున్న అధికారులు గ్రామస్తులను ప్రత్యేక బస్సుల్లో మెదక్ పట్టణంలోని వెంకటేశ్వర, జీకే ఆర్ గార్డెన్స్, ఫరీద్‌పూర్ రైతు వేదికలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ శ్రీనివాసరావు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ముప్పు లేకుండా చర్యలు చేపట్టారు.