
నేడు విద్యా సంస్థలకు సెలవు: కలెక్టర్
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో భారీ వర్షాల కారణంగా శుక్రవారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు విధిగా సెలవు పాటించాలని సూచించారు.
వర్షాలతో జాగ్రత్త
ఎమ్మెల్యే సునీతారెడ్డి
నర్సాపూర్: భారీ వర్షా లు కురుస్తున్నందున ప్ర జలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రజలను కోరారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. మరిన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నందున ప్రజలందరూ అత్యవసర పనులు ఉంటేనే ఇళ్ల నుంచి బయటకు రా వాలని సూచించారు. ఖచ్చితంగా ప్రయాణం చేయాల్సి వస్తే వాగులు, బ్రిడ్జిలు దాటాల్సి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి: ఏబీవీపీ
నిజాంపేట(మెదక్): రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం వినాయకుడికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారిన విద్యార్థుల గోస తీరడం లేదన్నారు. విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించారని, విద్యార్థులకు రావాల్సిన ఫీజులు రూ. 8,300 కోట్లను పెండింగ్‌లో పెట్టిందన్నారు. విద్యను వ్యాపారంగా మారుస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకొని గుర్తింపును రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో జస్వంత్, రఘు, భాను, నవదీప్ తదితరులు పాల్గొన్నారు.
పాక్షికంగా దెబ్బతిన్న 513 ఇళ్లు
మెదక్ కలెక్టరేట్: మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలతో జిల్లావ్యాప్తంగా 513 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని డీఆర్‌ఓ భుజంగరావు తెలిపారు. అలాగే 40 వేల కోడి పిల్లలు మృతి చెందగా, 49 రోడ్లు, 21 బ్రిడ్జిలు దెబ్బతినగా, జిల్లావ్యాప్తంగా 20 కాలనీల్లోకి వరద నీరు చేరిందన్నారు. మరోవైపు పోచారం డ్యాంకు బుంగపడిన నేపథ్యంలో 658 పైగా కుటుంబాలను పునరావాసం కోసం జిల్లా కేంద్రానికి తరలించి సహాయక చర్యలు అందిస్తున్నామని తెలిపారు.
గణనాథుడి సన్నిధిలో యాదాద్రి కలెక్టర్
పటాన్‌చెరు టౌన్: వినాయక చవితి పురస్కరించుకుని పటాన్‌చెరు మండలం పరిధిలోని రుద్రారం గ్రామ సమీపంలో గణేశ్‌గడ్డ దేవస్థానంలో గణేశుడిని బుధవారం యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు సిబ్బంది తీర్థ ప్రసాదాలను అందజేసి, కలెక్టర్‌ను సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఈవో లావణ్య, జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్ పాల్గొన్నారు.