
ఇప్పటికే రూ. కోటి కేటాయించాం
మెదక్ కలెక్టరేట్/హవేళిఘణాపూర్(మెదక్)/రామాయంపేట: వరద బాధితులను అన్ని విధాలుగా ఆ దుకుంటామని, ఇప్పటికే జిల్లాకు వరద సహాయం కింద రూ. కోటి కేటాయించామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే రోహిత్‌రావు, ప్రత్యేక అధికారి డాక్టర్ హరీశ్, కలెక్టర్ రాహుల్‌రాజ్, ఇతర శాఖల అధికారులతో భారీ వర్షాలు వరద సహాయక చర్యలపై సమీక్షించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిల తాత్కాలిక మరమ్మతులు చేపడుతామన్నారు. అనంతరం పునరావాస కేంద్రాలలో ప్రజల సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హవేళిఘణాపూర్ మండలం నాగాపూర్, బూర్గుపల్లి, వాడి, దూప్‌సింగ్ తండా, తిమ్మాయిపల్లిలో వరద తీరును పరిశీలించారు. అలాగే రామాయంపేట మ ండలంలోని పర్వతాపూర్ శివారులో కూలిన పుష్పాలవాగు బ్రిడ్జిని పరిశీలించారు. వర్షాలతో పంటలు నష్టపోయిన వారికి నష్టపరిహారం అందజేస్తామని, ఇళ్లు కూలిన వారికి ఇందిమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వరద నీటిలో చేపలు పట్టడం అత్యంత ప్రమాదకరమన్నారు.