
ప్రాణాలకు తెగించి.. కాపాడి
మెదక్ మున్సిపాలిటీ: వరద నీటిలో కారుతో పాటు కొట్టుకుపోయిన ఓ వ్యక్తి ప్రాణాలను ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం తమ ప్రాణాలకు తెగించి కాపాడింది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూ రుకు చెందిన నరేందర్‌గౌడ్ కారులో బుధవారం మెదక్ వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో హవేళిఘణాపూర్ మండలం నాగాపూర్ శివారులో నక్కవాగు వద్ద రోడ్డు తెగిపోయి వరద ఉధృతి అధికంగా ఉండటంతో కారుతో పాటు వాగులోకి కొట్టుకుపోయాడు. ఈ క్రమంలో వాగు మధ్యలో కారు చిక్కుకొని ఆగిపోగా, పైకి ఎక్కిన నరేందర్‌గౌడ్ తన కుటుంబ సభ్యులకు సెల్‌ఫోన్ ద్వారా సమాచారం అందించి లోకేషన్ పంపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రెస్క్యూటీంతో అక్కడికి చేరుకొని అతడిని కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చి ప్రాణాలు కాపాడారు.
ºÆŠḥ¢yólMýS$ JMýS Æøk Ð]l¬…§ýl$..
పుట్టిన రోజుకు ఒక రోజు ముందు వరద నీటిలో చిక్కుకున్న నరేందర్‌గౌడ్ 8 గంటల పాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడు. ఎట్టకేలకు రెస్క్యూ టీం ప్రాణాలకు తెగించి ఒడ్డుకు చేర్చారు. ఈసందర్భంగా మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌రావు, మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు ఒకరోజు ముందుగానే నరేందర్‌కు కేక్ తినిపించి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. దేవుడు తనకు ప్రాణ భిక్షపెట్టి పునర్జన్మనిచ్చాడని నరేందర్‌గౌడ్ భావోద్వేగానికి లోనయ్యాడు. సకాలంలో స్పందించి తన ప్రాణాలు కాపాడిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు.
హవేళిఘణాపూర్ మండలం వాడి గ్రామానికి చెందిన ఓ గర్భిణి పురిటి నొప్పులతో బాధ పడుతుండగా, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం ఆమెను మెదక్‌లోకి ఎంసీహెచ్‌కు క్షేమంగా తరలించారు. ఈసందర్భంగా కలెక్టర్ రాహుల్‌రాజ్ ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని అభినందించారు.