నామినేటెడ్‌కు వేళాయే! | - | Sakshi
Sakshi News home page

నామినేటెడ్‌కు వేళాయే!

Aug 21 2025 11:08 AM | Updated on Aug 21 2025 11:08 AM

నామినేటెడ్‌కు వేళాయే!

నామినేటెడ్‌కు వేళాయే!

● మెదక్‌ మార్కెట్‌ కమిటీ పదవీకాలం 2023 సెప్టెంబర్‌ 23తో ముగిసింది. ఇది బీసీ రిజర్వేషన్‌ కావటంతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మంగ మోహన్‌గౌడ్‌, మెదక్‌ మండల అధ్యక్షు డు శంకర్‌, పట్టణ అధ్యక్షుడు గూడూరి ఆంజనేయులు, ముత్యంగౌడ్‌ పదవి ఆశిస్తున్నారు. ● రామాయంపేట మార్కెట్‌ కమిటీ పదవీ కాలం 2023 జూన్‌ 25తో ముగిసింది. ఎస్టీ రిజర్వుడు కావటంతో చిన్నశంకరంపేట సీనియర్‌ నేతలు సురేందర్‌నాయక్‌, మోహన్‌నాయక్‌, అశోక్‌నాయక్‌, నార్సింగి మండలానికి చెందిన రాజాసింగ్‌, నిజాంపేట మండలానికి చెందిన రాంచందర్‌నాయక్‌ ఆశిస్తున్నారు. ● పాపన్నపేట మార్కెట్‌ కమిటీ 2023 డిసెంబర్‌ 23న ముగిసింది. ఇది ఎస్సీ రిజర్వేషన్‌ కా వడంతో వినోద్‌ అమృత్‌రావు, సూర్యరావు, క్రీస్తుదాసు, దుర్గేశ్‌ ఆశిస్తున్నారు. ● నర్సాపూర్‌ మార్కెట్‌ కమిటీ పదవీకాలం 2023 నవంబర్‌ 23న ముగిసింది. ఇది బీసీ రిజర్వుడు కావటంతో నర్సాపూర్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లేశ్‌, శివ్వంపేట మండల పార్టీ అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్‌ ఆశిస్తున్నారు. ● చేగుంట మార్కెట్‌ కమిటీ పాలకమండలి 2022 మే 12న ముగిసింది. ఇది ఓసీ రిజర్వేషన్‌ కావడంతో ఆ పార్టీ సీనియర్‌ నేత వెంగళరావు తాజా మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రవీణ్‌ కుమార్‌ పోటీ పడుతున్నారు. ● తూప్రాన్‌లో మార్కెట్‌ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటివరకు అక్కడ పాలక మండలిని ఏర్పాటు చేయలేదు. కాగా అది ఓసీ రిజర్వేషన్‌ కావటంతో అధికార పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు భాస్కర్‌రెడ్డి, మల్లారెడ్డి పోటీ పడుతున్నారు.

జిల్లాలో ఆరు మార్కెట్‌ కమిటీలు ఆశావహుల పేర్లు ఖరారు.. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ప్రకటన

జిల్లాలో మెదక్‌, రామాయంపేట, పాపన్నపేట, నర్సాపూర్‌, చేగుంటతో పాటు నూతనంగా ఏర్పాటైన తూప్రాన్‌తో కలిపి మొత్తం ఆరు మార్కె ట్‌ కమిటీలు ఉన్నాయి. అలాగే ఏడుపాయల దేవస్థానం పాలకమండలి ఉంది. మార్కెట్‌ కమిటీల పదవీకాలం ముగిసి రెండేళ్లు పూర్తికాగా, ఏడుపాయల పాలకమండలి పదవి ముగిసి ఏడాది గడిచింది. కాగా మార్కెట్‌ కమిటీలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌తో పాటు 10 మంది డైరెక్టర్లు, ఇద్దరు లైసెన్స్‌ ట్రేడర్స్‌ సభ్యులు, జిల్లా మార్కెటింగ్‌ అధికారి, సొసైటీ చైర్మన్‌, అగ్రికల్చర్‌ అధికారి, మున్సిపల్‌ ప రిధి అయితే మున్సిపల్‌ చైర్మన్‌, గ్రామీణ ప్రాంతం అయితే సర్పంచ్‌ సభ్యులుగా ఉంటారు. మొత్తం 18 మంది పాలకమండలిలో ఉంటారు.

ఈఓ ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు..

రాష్ట్రంలోనే ప్రసిద్ధిచెందిన ఏడుపాయల దేవస్థానానికి ఏడాదిగా పాలకమండలి లేకుండానే ఈఓ ఆధ్వర్యంలో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆలయంలో మొత్తం ధర్మకర్తలు 14 మంది ఉంటారు. ఇందులో ఒక చైర్మన్‌తో పాటు 13 మంది సభ్యులు కొనసాగుతారు. వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలతో పాటు ఉన్నతవర్గాలకు చెందిన వారు సైతం సభ్యులుగా ఉంటారు. కాగా చైర్మన్‌ పదవిని పాపన్నపేట మండలానికి చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు గోవింద్‌నాయక్‌, శ్రీకాంతప్ప, సతీశ్‌, శ్రీకాంత్‌రెడ్డి, మల్లప్ప ఆశిస్తున్నారు.

పదిహేను రోజుల్లో పదవుల భర్తీ!

జిల్లాలోని పలు నామినేటెడ్‌ పదవుల భర్తీకి కసరత్తు పూర్తయినట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పదవుల భర్తీ చేసేందుకు అధికార పార్టీ నేతలు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్‌ నేతల పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం. మరో 15 రోజుల్లో పదవుల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని జిల్లాకు ఓ సీనియర్‌ నేత పేర్కొన్నారు. – మెదక్‌జోన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement